తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినిమాహాళ్లు తెరవండి.. ఉద్యోగాలు కాపాడండి' - సినిమా థియేటర్​ కార్మికుల నిరసన

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికే థియేటర్లు తెరిచినా.. మన దేశంలో అనుమతి ఇవ్వకపోవడంపై థియేటర్ల కార్మికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సినిమా హాళ్లు తెరవకపోవడం వల్ల చిత్ర పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టంతో పాటు వాటిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సినిమాహాళ్లు తెరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సోషల్​మీడియాలో ప్రభుత్వానికి విన్నవించుకున్నారు నటి నమ్రత.

Multiplex group appeals to govt to reopen cinemas, says jobs are at stake
'సినిమాహాళ్లు తెరవండి.. ఉద్యోగాలను కాపాడండి'

By

Published : Sep 16, 2020, 9:15 AM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా బాగా నష్టపోయిన రంగాల్లో చిత్రపరిశ్రమ ఒకటి. అన్​లాక్​లో భాగంగా షాపింగ్​ మాల్స్​, విమాన సర్వీసులు, రైల్వేలు, బస్సులు, మెట్రో, హోటళ్లు, జిమ్​లు ఇలా చాలా రంగాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. థియేటర్లు తెరుచుకోవడానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే థియేటర్లను త్వరగా తెరిచేలా చూడాలంటూ దేశంలోని అన్ని సినీ పరిశ్రమల నుంచి వినతులు వస్తున్నాయి.

రూ.వేల కోట్ల నష్టం

'అన్​లాక్​ సినిమాస్​.. సేవ్​ జాబ్స్​' పేరుతో ఇన్​స్టాలో మొదలైన హ్యాష్​ట్యాగ్​కు పలువురు సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ ఆరు నెలల లాక్​డౌన్​తో భారతీయ చిత్ర పరిశ్రమకు నెలకు సుమారు రూ.1500 కోట్ల చొప్పున రూ.9000 కోట్లు నష్టపోయినట్లు ఇందులో ప్రస్తావించారు.

"దేశవ్యాప్తంగా పదివేల స్క్రీన్లు మూసేయడం వల్ల ప్రత్యక్షంగా రెండు లక్షల మంది, పరోక్షంగా ఎన్నో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని థియేటర్లను తెరిస్తే చాలా మంచిది. ఇప్పటికే చైనా, కొరియా, యూకే, ఇటలీ, యూఏఈ, యూఎస్​ఏ, సింగపూర్​, మలేసియా, శ్రీలంక తదితర దేశాల్లో జాగ్రత్తలు తీసుకుని థియేటర్లను తెరిచారు. అక్కడ వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటం, థియేటర్లు తెరుచుకోవడం వల్ల సినిమా రంగంపై ఆధారపడిన చాలామంది జీవితాలు రోడ్డున పడ్డాయి. అందుకే ప్రభుత్వం త్వరగా థియేటర్లను తెరిచేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నాం" అని హ్యాష్​ట్యాగ్​లో రాశారు.

నమ్రతా శిరోద్కర్

నమ్రత మద్దతు

దీనిపై ప్రముఖ కథానాయకుడు మహేశ్​ బాబు సతీమణి నమ్రత స్పందించారు. "థియేటర్లను త్వరగా తెరవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. సినిమాపై ఆధారపడిన వారి ఉద్యోగాలు, ఉపాధికి సంబంధించిన విషయమిది" అని నమ్రత ఏఎమ్​బీ సినిమాస్​ పెట్టిన పోస్ట్​ను రీపోస్ట్​ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details