నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున వరుస సర్ప్రైజ్లు అభిమానుల్ని సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి! వీటిలో 'అఖండ' కొత్త పోస్టర్‌తో పాటు, రెండు కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు ఉన్నట్లు తెలుస్తోంది.
Balakrishna: బాలకృష్ణ పుట్టినరోజున వరుస సర్ప్రైజ్లు! - Balakrishna news
అగ్రకథానాయకుడు బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా వరుస ప్రకటనలు రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో అఖండ కొత్త లుక్‌తో పాటు రెండు కొత్త సినిమాల గురించి వెల్లడించనున్నారట.
బాలకృష్ణ
కొన్నినెలల క్రితం 'అఖండ' టీజర్ విడుదల చేసి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించారు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన పుట్టినరోజు కానుకగా మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారని సమచారం. మరోవైపు 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య చిత్రంపై ప్రకటన, అలానే అనిల్ రావిపూడితో బాలకృష్ణ చేయనున్న ప్రాజెక్టు గురించే ఇదే రోజున వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. వీటిన్నంటిపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.