ఎం.ఎస్.రాజు అనే పేరు వినగానే మనకు ఆయన తీసిన 'శత్రువు', 'ఒక్కడు' 'పౌర్ణమి'లాంటి చిత్రాలకు నిర్మాతగా, 'తూనీగా తూనీగా', 'వాన'లాంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకుడిగా మన కళ్ల ముందు కనిపిస్తారు. అలాంటి ఎం.ఎస్.రాజు ప్రస్తుతం 'డర్టీ హరి' అనే రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎపీపీజే క్రియేషన్స్ పతాకంపై నిర్మితమయ్యే చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రాత్ కౌర్ తదితరులు నటిస్తున్నారు.
హరి ఆ ఐదు రూల్స్ ఫాలో అయ్యాడా! - MS Raju Dirty Hari trailer
ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో ప్రస్తుతం 'డర్టీ హరి' అనే రొమాంటిక్ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
హరి ఆ ఐదు రూల్స్ ఫాలో అయ్యాడా!
తాజాగా శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఒకటి విడుదలైంది. సునీల్ వాయిస్ ఓవర్‌తో చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. మనుషుల్లోని క్రూరత్వం, విచక్షణారాహిత్యం వల్ల కలిగే నష్టాలను ఈ సినిమాలో చూపించనున్నారట. "ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలోనే విడుదల చేస్తాం" అని నిర్మాతలు వెల్లడించారు.