>'మీ వదినను పరిచయం చేస్తాను' అంటూ ఫాలోవర్లకు చెప్పిన హీరో వరుణ్ ధావన్.. అందుకు సమాధానంగా తన కొత్త సినిమా 'కూలీ నం.1'లోని 'తేరే బాబీ' గీతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో సారా అలీఖాన్ హీరోయిన్. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. డిసెంబరు 25న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుందీ చిత్రం.
>నితిన్, కీర్తి సురేశ్.. ప్రస్తుతం 'రంగ్‌దే' చిత్రీకరణలో భాగంగా దుబాయ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో గురవారం స్పీడ్ బోట్లో ప్రయాణించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
>చియాన్ విక్రమ్ నటిస్తున్న 'కోబ్రా' షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇందులో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు.
>యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తీస్తున్న 'జాంబీ రెడ్డి' తొలి బైట్.. శనివారం(డిసెంబరు 5) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో తేజ, ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
>హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా 'వండర్ ఉమన్ 1984'.. ప్రకటించిన విడుదల తేదీ కంటే ఒకరోజు ముందే తీసుకొస్తున్నారు. డిసెంబరు 24న తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
>ఆదిత్య రాయ్ కపూర్, సంజనా సంఘీ ప్రధాన పాత్రలో చేస్తున్న 'ఓమ్' షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. రెండు ఫొటోల్ని కూడా పోస్ట్ చేసింది. కపిల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
>అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్‌తో పాటు అంగిరా ధర్ కూడా 'మేడే' సినిమాలో నటించనుంది. ఈ విషయాన్ని గురువారం ప్రకటించారు. హైదరాబాద్‌లో త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
>పార్వతి నాయర్ నటిస్తున్న తమిళ సినిమా 'రూబమ్' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. హారర్ కథతో తీస్తున్న ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. తమరై సెల్వన్ దర్శకత్వం వహిస్తున్నారు.
కోబ్రా షూటింగ్లో హీరో విక్రమ్
డిసెంబరు 24న 'వండర్ ఉమన్ 1984' సినిమా విడుదల
తొలి బైట్ విడుదల చేస్తామంటూ జాంబీ రెడ్డి పోస్టర్
రూబమ్ ఫస్ట్‌లుక్‌లో పార్వతి నాయర్