తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లిఫ్ట్​లో అనసూయ.. థియేటర్లలో మళ్లీ ఆ సినిమాలు - వరుణ్ తేజ్ కొత్త సినిమాలో హీరోయిన్​గా సయీ మంజ్రేకర్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో థాంక్యూ బ్రదర్, తలైవి, భూమి, క్రాక్, యువరత్న చిత్రాల సంగతులు ఉన్నాయి. ఇంతకీ అవి ఏంటంటే?

movie updates from thank you brother, krack, bhoomi, yuvaratna, thalaivi, v, orey bujjiga, VT10
సినిమా అప్​డేట్స్

By

Published : Dec 24, 2020, 3:05 PM IST

Updated : Dec 24, 2020, 5:53 PM IST

*నటి, వ్యాఖ్యాత అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'థాంక్యూ బ్రదర్'. సూపర్​స్టార్ మహేశ్​బాబు.. ఈ సినిమా టీజర్​ను గురువారం విడుదల చేశారు. లిఫ్ట్​లో చిక్కుకుపోయిన ఓ గర్భిణి, యువకుడు.. ఎలా బయటపడ్డారు అనే కథతో దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రమశే రాపర్తి దర్శకుడు.

*ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్​జీఆర్ వర్ధంతి సందర్భంగా.. 'తలైవి' సినిమాలోని ఆయన ఫస్ట్​లుక్స్​ను విడుదల చేశారు. ఈ ఫొటోల్లో పాత్రధారి అరవింద స్వామి అదరగొట్టేశారు. ఇందులో కంగన జయలలితగా కనిపిస్తుండగా, ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

*న్యూయర్ కానుకగా 'వి', 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ మేరకు చిత్రబృందాలు పోస్టర్లను విడుదల చేశాయి. ఇప్పటికే వీటిని ఓటీటీలో చూసిన ప్రజలు.. తిరిగి థియేటర్లలో చూస్తారో లేదో?

*కోలీవుడ్​ హీరో జయం రవి కొత్త సినిమా 'భూమి'.. నేరుగా డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో విడుదల కానుంది. సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం సహా ఓ నోట్​ను కథానాయకుడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

*జగపతిబాబు ప్రధాన పాత్రలో కార్తీక్, అమ్ము అభిరామి కలిసి నటించిన సినిమా 'ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్'. విద్యాసాగర్ రాజు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, జనవరిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

*'బిగ్​బాస్ 4' ఫేమ్ సొహైల్ హీరోగా తొలి సినిమా చేస్తున్నారు. గురువారం లాంఛనంగా ప్రారంభించడం సహా ప్రకటన చేశారు. శ్రీనివాస్ దర్శకత్వం వహించనుండగా, ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

*'క్రాక్', 'యువరత్న' సినిమాల్లో లిరికల్ సాంగ్స్.. క్రిస్మస్​ కానుకగా విడుదల కానున్నాయి.

*వరుణ్ తేజ్ కొత్త సినిమాలో హీరోయిన్​గా సయీ మంజ్రేకర్​ నటిస్తోంది. ఈ మేరకు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది చిత్రబృందం. ఇందులో వరుణ్ బాక్సర్​గా కనిపించనున్నారు. కిరణ్ దర్శకుడు.

తలైవి సినిమాలో ఎమ్​జీఆర్​ గెటప్​లో అరవింద స్వామి
న్యూయర్​ కానుకగా థియేటర్లలో 'వి' విడుదల
న్యూయర్​ కానుకగా థియేటర్లలో ఒరేయ్ బుజ్జిగా విడుదల
భూమి సినిమాలో జయం రవి
క్రాక్ సినిమాలో రవితేజ, శ్రుతిహాసన్
యువరత్న సినిమా లిరికల్ గీతం
జగపతిబాబు కొత్త సినిమా
జగపతిబాబు కొత్త సినిమా
బిగ్​బాస్ ఫేమ్ సొహైల్ హీరోగా తొలి సినిమా
వరుణ్ తేజ్ కొత్త సినిమాలో హీరోయిన్​గా సయీ మంజ్రేకర్
Last Updated : Dec 24, 2020, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details