తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రొమాంటిక్​ సాంగ్​తో రామ్.. జైసల్మేర్​లో అక్షయ్ - అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో రామ్ రెడ్, బచ్చన్ పాండే, ఓదెల రైల్వేస్టేషన్, 100 కోట్లు చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from RED, MASTER, BACHCHAN PANDEY, ODELA RAILWAY STATION, 100 CRORES
రొమాంటిక్​ సాంగ్​తో రామ్.. జైసల్మేర్​లో అక్షయ్

By

Published : Jan 6, 2021, 1:27 PM IST

*రామ్ 'రెడ్' సినిమా నుంచి 'నువ్వే నువ్వే' వీడియో సాంగ్​ విడుదలైంది. వినసొంపైన సంగీతంతో చిత్రంపై అంచనాల్ని పెంచుతోందీ గీతం. మాళవిక, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్లు. కిశోర్ తిరుమల దర్శకుడు. జనవరి 14న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు.

*అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' షూటింగ్ జైసల్మేర్​లో ప్రారంభమైంది. నిర్మాత సాజిద్ నడియావాలా కుమారులు క్లాప్​ కొట్టారు. ఈ సినిమాలో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లు. ఫర్హాద్ సమ్జీ దర్శకుడు.

*బాలీవుడ్​ కథానాయకుడు టైగర్​ష్రాప్​ పాడిన రెండో గీతం 'కాసినోవా' త్వరలో విడుదల కానుంది. అంతకుముందు 'అన్​బిలీవబుల్' ఆల్బమ్ సాంగ్​తో ఆకట్టుకున్నారు. పునీత్ మల్హోత్రా దీనిని డైరెక్ట్​ చేశారు.

*హెబ్బా పటేల్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ 'ఓదెల రైల్వేస్టేషన్' నుంచి ఆమె కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. '100క్రోర్స్'(100 కోట్లు) టైటిల్​తో తెరకెక్కుతున్న కొత్త తెలుగు చిత్రం పోస్టర్​ను దర్శకుడు హరీశ్ శంకర్​ రిలీజ్​ చేశారు.

ఇది చదవండి:థియేటర్ల​లోకి 100 శాతం ప్రేక్షకులు.. జూ.డాక్టర్ ఆవేదన

ABOUT THE AUTHOR

...view details