తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తేదీల్ని ఫిక్స్ చేసిన అక్షయ్ కుమార్, శర్వానంద్ - వసంత కోకిల సినిమా టీజర్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో బచ్చన్ పాండే, శ్రీకారం, ఆయుష్మాన్ కొత్త సినిమాల సంగతులు ఉన్నాయి.

movie updates latest
తేదీల్ని ఫిక్స్ చేసిన అక్షయ్ కుమార్, శర్వానంద్

By

Published : Jan 23, 2021, 5:02 PM IST

Updated : Jan 23, 2021, 6:07 PM IST

*అక్షయ్ కుమార్ యాక్షన్ డ్రామా 'బచ్చన్ పాండే' విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా దీనిని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఫరాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ హీరోయిన్లు.

అక్షయ్ కుమార్ 'బచ్చన్​ పాండే' రిలీజ్ డేట్

*శర్వానంద్ హీరోగా నటిస్తున్న శ్రీకారం రిలీజ్ డేట్ ఫిక్సయింది. శివరాత్రి కానుకగా మార్చి 11న తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. కిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

శర్వానంద్ శ్రీకారం మూవీ

*బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా.. కొత్త సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. తనతో 'ఆర్టికల్ 15' లాంటి అద్భుత చిత్రం తీసిన అనుభవ్ సిన్హాతో కలిసి మరోసారి పనిచేయనున్నారు. స్పై థ్రిల్లర్​ కథతో దీనిని తెరకెక్కించనున్నారు.

హీరో ఆయుష్మాన్ ఖురానా

*సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఇదే మా కథ' సినిమా టీజర్.. ఈనెల 25న సాయంత్రం విడుదల కానుంది. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్ గొల్ల నిర్మిస్తున్నారు.

'ఇదే మా కథ' టీజర్
సాయితేజ్ కొత్త సినిమా టైటిల్ మోషన్ పోస్టర్
రవితేజ ఖిలాడీ అప్​డేట్
వసంత కోకిల సినిమా టీజర్
Last Updated : Jan 23, 2021, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details