తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కలెక్షన్ కింగ్ మోహన్​బాబు.. సరికొత్తగా వెబ్ సిరీస్​లో! - బాలకృష్ణ అన్​స్టాపబుల్

తెలుగు నటీనటులు మెల్లగా ఓటీటీలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు తారలు సిరీస్​లు, షోలు చేస్తుంటగా.. ఇప్పుడు సీనియర్ నటుడు మోహన్​బాబు(mohan babu movies) కూడా ఓ వెబ్ సిరీస్​లో నటించేలా కనిపిస్తున్నారు.

MohanBabu In A Web Series
మోహన్​బాబు

By

Published : Oct 21, 2021, 12:19 PM IST

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. 'ఆహా' ఓటీటీ(aha app) ప్రారంభించినప్పుడు చాలామంది పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో మెగా హీరోలే సినిమాలు, వెబ్ సిరీస్​లే ఉంటాయని భావించారు. అయితే ఇప్పుడు వాటన్నింటిని చెక్ పెడుతూ సరికొత్త పంథాలో వెళ్తున్నారు నిర్మాత అరవింద్.

ముద్దుగుమ్మ సమంత(samantha latest news) హోస్ట్​గా 'సామ్ జామ్' షో పెట్టి, తొలి సీజన్​ పూర్తి చేశారు. మంచు లక్ష్మితో ఓ వంట ప్రోగ్రాంను రూపొందించారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా 'అన్​స్టాపబుల్' టాక్​ షోను(balakrishna unstoppable) త్వరలో ప్రసారం చేయనున్నారు. ఇప్పుడు కలెక్షన్​ కింగ్ మోహన్​బాబుతోనూ ఓ వెబ్ సిరీస్​ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

రజనీకాంత్​తో మోహన్​బాబు

ఇటీవల 'మా' ఎలక్షన్(maa elections 2021) చూసిన తర్వాత చాలామంది అల్లు అరవింద్, మంచు కుటుంబానికి మధ్య మనస్పర్థలు ఉన్నాయేమోనని అనుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో మంచు విష్ణుకు అండగా నిలిచిన బాలయ్య.. టాక్​ షోకు హోస్ట్​గా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చి సదరు వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. అన్ని అనుకున్నట్లు జరిగితే కొత్త వెబ్ సిరీస్​లో మోహన్​బాబును చూడొచ్చు!

తమిళ స్టార్ డైరెక్టర్​ ఒకరు ఈ సిరీస్​ కథ రాశారట. మోహన్​బాబు(mohan babu family) అయితే ఇందులోని ప్రధాన పాత్రకు సరిగ్గా సరిపోతారని అల్లు అరవింద్, ఆయన బృందం భావిస్తున్నారట. మోహన్​బాబుతో ఇదే విషయమై చర్చలు జరపాలని భావిస్తున్నారట.

బాలయ్యతో మోహన్​బాబు

ఈ ఓటీటీ యాప్​లో ఇప్పటికే మంచు లక్ష్మి(manchu lakshmi age) షో చేయడం వల్ల మోహన్​బాబును ఒప్పించగలమనే ధీమాతో 'ఆహా' టీమ్ ఉంది. త్వరలో ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details