తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సముద్రపు ఒడ్డున మోహన్​బాబు.. ట్రైలర్​తో ప్రదీప్ - నాగశౌర్య పోలీసు వారి హెచ్చరిక

నట ప్రపూర్ణ మోహన్ బాబు తన ఫ్యామిలీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ట్రైలర్​, నాగశౌర్య కొత్త చిత్రం ప్రకటనలు వచ్చాయి. అవేంటో చూద్దాం.

Mohanbabu enjoys at beach
సముద్రపు ఒడ్డున మోహన్​బాబు

By

Published : Jan 21, 2021, 6:31 PM IST

నట ప్రపూర్ణ మోహన్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెకేషన్ కోసం వెళ్లారు. అక్కడ సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భార్యతో మోహన్​బాబు
కుటుంబంతో మోహన్​బాబు

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించారు. ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమా.. జనవరి 29న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేశారు.

నాగశౌర్య హీరోగా కొత్త చిత్రం రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ లోగో విడుదల చేశారు. 'పోలీసు వారి హెచ్చరిక' టైటిల్​తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేపీ రాజేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

నాగశౌర్య కొత్త చిత్రం

ABOUT THE AUTHOR

...view details