తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2020, 2:23 PM IST

ETV Bharat / sitara

'మీర్జాపూర్​-2' విడుదల తేదీపై క్లారిటీ

మొన్నటి వరకు సినిమాలకు సీక్వెల్స్‌ వచ్చేవి. ఇప్పుడు ఆ హవా వెబ్‌ సీరిసుల్లోకి వచ్చేసింది. అమెజాన్​ ప్రైమ్​లో ఎక్కువ ప్రజాదరణ పొందిన 'మీర్జాపూర్​' వెబ్​సిరీస్​.. రెండో సీజన్​తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సీక్వెల్​ విడుదలపై అమెజాన్​ప్రైమ్​ తాజాగా స్పష్టత ఇచ్చింది.

Mirzapur Season 2: Here's when the Amazon Prime Video series will start streaming
'మీర్జాపూర్​-2' విడుదలపై అమెజాన్​ ప్రైమ్​ స్పష్టత!

ఓటీటీల్లో క్రైమ్​ జోనర్​ కథలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి నేర కథాంశంతో రూపొందిందే 'మీర్జాపూర్​'​. అమెజాన్ ​ప్రైమ్​ వేదికగా విడుదలైన ఈ సిరీస్​ విశేషాదరణ పొందింది. దీని తొలి సీజన్​ హిట్​ కావడం వల్ల రెండో సీజన్​పై ప్రేక్షకుల్లో మరింత క్రేజ్​ పెరిగింది. కాగా ఈ కొత్త సిరీస్​ రిలీజ్​పై సదరు ఓటీటీ సంస్థ స్పష్టతనిచ్చింది. అక్టోబరు 23 నుంచి ప్రైమ్​లో 'మీర్జాపూర్​' రెండో సీజన్​ను ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.

కథేంటంటే..!

ఉత్తరప్రదేశ్​లోని మీర్జాపూర్‌ అనే ప్రాంతంలో అఖండానంద్‌ అనే మాఫియా డాన్‌ ఉంటాడు. అక్కడ ఆయన మాటే శాసనం. అలాంటి వ్యక్తి కుమారుడైన మున్నాకు.. ఓ సాధారణ లాయర్‌, ఆయన కుమారులు గుడ్డు, బబ్లూ మధ్య వైరం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే 'మీర్జాపూర్‌' కథ. అలీ ఫజల్‌, విక్రాంత్‌ మాసే, పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్‌ థిల్లర్ వెబ్‌సిరీస్‌కు కరణ్‌ అన్షుమాన్‌ దర్శకుడు. 2018 నవంబర్‌లో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన తొలి సీజన్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ కొట్టడం వల్ల 'మీర్జాపూర్‌-2' పట్టాలెక్కింది.

ABOUT THE AUTHOR

...view details