ఆసియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్‌లో నటి కొంకన సేన్ శర్మ, అమృత సుభాష్ అదరగొట్టారు. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న 'మీర్జాపుర్' వెబ్ సిరీస్ కూడా రెండు అవార్డులు దక్కించుకుంది.
సింగపూర్‌లో గురువారం-శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వివిధ క్రియేటివ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో మెప్పించిన పలువురికి అవార్డులు అందజేశారు. టీవీ, స్ట్రీమింగ్ కంటెంట్‌కు సంబంధించి మొత్తం 38 అవార్డులు బహుకరించారు.
Mirzapur season 2: అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న యాక్షన్ డ్రామా 'మీర్జాపుర్'.. బెస్ట్ ఒరిజినల్ ప్రోగ్రామ్ విభాగంలో రెండు అవార్డులు గెలుచుకుంది. అయితే ఈ అవార్డును సిరీస్‌లో నటించిన బ్రహ్మస్వరూప్కు అంకితమిస్తున్నట్లు సిరీస్ సృష్టికర్త పునీత్ కృష్ణ చెప్పారు. శుక్రవారం తన అపార్ట్మెంట్లో అనుమానస్పద రీతిలో మరణించారు బ్రహ్మస్వరూప్ మిశ్రా.