ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ సినిమాలు భారీ సెట్స్‌కు పెట్టింది పేరు. 'ఒక్కడు', 'రుద్రమదేవి' తదితర సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఆయన నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్టు 'శాకుంతలం'. సమంత టైటిల్ రోల్లో నటిస్తోంది. మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు.
మరి ఇలాంటి ఇతిహాస కథను కళ్లకు కట్టినట్టు చూపించాలంటే కళాత్మకంగా ఎంతో శ్రమించాలి. ప్రస్తుతం అదే పనిలో ఉంది చిత్రబృందం. అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖ కళా దర్శకుడు అశోక్ సంబంధిత నమూనా సెట్స్‌ను రూపొందించి ఔరా అనిపిస్తున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.