తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైరల్: కోడలు ఉపాసన ఫొటో మెగాస్టార్ తీస్తే​ - megastar snaps upasana

మెగాకోడలు ఉపాసన సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అయితే అందులో ఓ ఫొటో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తీయడం విశేషం.

ఉపాసన

By

Published : Sep 23, 2019, 12:39 PM IST

Updated : Oct 1, 2019, 4:33 PM IST

ఆదివారం జరిగిన 'సైరా' ప్రీరిలీజ్ వేడుకలో మెగా కుటుంబం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో రామ్​చరణ్ భార్య ఉపాసన తళుక్కున మెరిసింది. అక్కడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. కానీ ఇప్పుడవి వైరల్​ అవుతున్నాయి. అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ ఫొటో తీయడం.

చిరంజీవి తీసిన ఉపాసన ఫొటో

సామాజిక మాధ్యమాల్లో వీటిని షేర్ చేసిన ఉపాసన.. ఈవెంట్​కు ముందు ఈ ఫొటోషూట్ జరిగిందని చెప్పింది.

'సైరా' వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి వినాయక్, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. తమిళ నటుడు విజయ్​ సేతుపతి కార్యక్రమంలో సందడి చేశాడు. వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. ఒక్కడు 2.0: మళ్లీ అదే లొకేషన్​లో మహేశ్

Last Updated : Oct 1, 2019, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details