'సైరా' ప్రచారంలో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం దర్శకుడు కొరటాల శివతో కలిసి పనిచేయనున్నాడు. ఆ తర్వాత చేయబోయే సినిమాపై స్పష్టత ఇచ్చాడు మెగాస్టార్. వినోదాత్మక కుటుంబ కథలో నటించనున్నట్లు చెప్పాడు. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడని తెలిపాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరంజీవి.."త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా పూర్తి కుటుంబ కథా చిత్రమని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని" చెప్పాడు
చిరుతో త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఎప్పుడు? - syeraa cinema
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నట్లు చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. కుటుంబ కథతో, హాస్యభరితంగా ఉండనుందన్నాడు. అయితే చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి.
చిరుతో త్రివిక్రమ్ సినిమా.. మరి కథేంటీ..?
ప్రస్తుతం 'అల.. వైకుంఠపురములో' సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉండగా.. కొరటాల చిత్రంతో వచ్చే ఏడాదంతా బిజీగా గడపనున్నాడు చిరంజీవి. కాబట్టి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈలోపు మాటల మాంత్రికుడు మరో సినిమా చేసుకుంటాడా? చిరు కోసం ఎదురు చూస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇది చదవండి: వీడియో: ఉయ్యాలవాడ నరసింహుడా.. ఓ సైరా
Last Updated : Oct 2, 2019, 1:14 PM IST