చిత్ర పరిశ్రమకి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులతో కలిసి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం కానున్నట్టు తెలిపారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన వై.ఎస్.జగన్‌తో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ఆ విషయాన్ని ట్వీట్ చేశారు చిరు.
సీఎం జగన్‌కు 'చిరు' కృతజ్ఞతలు - chiranjeevi
సింగిల్ విండోలో చిత్రీకరణల అనుమతులకు జీవో విడుదల చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్ ముగిశాక చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేద్దామని జగన్ చెప్పినట్లు ట్వీట్ చేశారు చిరు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన చిరు
"సినీ పరిశ్రమకు మేలు చేసే నిర్ణయాలతో పాటు సింగిల్ విండోలో చిత్రీకరణల అనుమతులకు జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరఫున జగన్‌కు ఫోన్‌లో కృతజ్ఞతలు తెలిపాను. లాక్‌డౌన్ ముగిశాకా చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని జగన్ చెప్పార"ని ట్వీట్‌లో పేర్కొన్నారు చిరంజీవి. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని చిత్ర పరిశ్రమ తరఫున చిరంజీవి, నాగార్జున తదితరుల బృందం కలిసింది.
ఇదీ చూడండి...పట్టాలెక్కనున్న సినిమాలు.. ఇక క్లాప్ కొట్టేద్దామా!