తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఉప్పెన' టీమ్​కు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్​లు - krithi shetty chiranjeevi

'ఉప్పెన' ప్రేక్షకుల్ని అలరిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం మొత్తానికి ప్రత్యేక బహుమతులు పంపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వాటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

megastar chiranjeevi special gifts to uppena team
'ఉప్పెన' టీమ్​కు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్​లు

By

Published : Feb 22, 2021, 6:48 PM IST

వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఉప్పెన'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా వైష్ణవ్‌, కృతి, విజయ్‌ సేతుపతిల నటన బుచ్చిబాబు టేకింగ్‌ సినిమాను విజయపథంలో నడిపాయి. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.

ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి 'ఉప్పెన' టీమ్‌ను అభినందించడం సహా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు పంపారు. వాటిని అందుకున్న వారిలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, కథానాయిక కృతిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబు, మైత్రీ మూవీ మేకర్స్‌ తదితరులకు ఉన్నారు. అలానే ఆ గిఫ్ట్​ ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details