మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'భోళా శంకర్' పేరు నిర్ణయించారు. ఆదివారం చిరు పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చేతుల మీదుగా ఫస్ట్‌లుక్ వీడియోను కూడా విడుదల చేశారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రానున్నట్లు ఇందులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశముంది.
మెగాస్టార్ కొత్త సినిమా 'భోళా శంకర్' - Megastar Chiranjeevi movie updates
మెగాస్టార్ పుట్టినరోజున ఆయన అభిమానులను ఖుషీ చేసే వార్త ఇది. చిరు కొత్త సినిమాకు 'భోళా శంకర్' టైటిల్ పెట్టడం సహా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
చిరంజీవి
ఇప్పటికే 'ఆచార్య'తో బిజీగా ఉన్న చిరంజీవి.. ఆ తర్వాత 'గాడ్‌ఫాదర్' చేస్తారు. అనంతరం ఈ సినిమా, బాబీ దర్శకత్వంలో మరో ప్రాజెక్టులో నటిస్తారు. ఇవన్నీ వరుసగా విడుదల కానుండటం వల్ల మెగాఫ్యాన్స్కు పండగే పండగ.
ఇవీ చదవండి:
Last Updated : Aug 22, 2021, 1:19 PM IST