మెగాస్టార్ చిరంజీవి దోశలు వేసి అలరించారు. భోగి పండను కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనలోని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. అభిమానులకు భోగీ శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి కూడా ఓ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.
భోగి స్పెషల్.. ఇది మెగాస్టార్ చిరంజీవి దోశ - varun tej vaishnav tej chiranjeevi dosa
భోగి పండగను కుటుంబంతో కలిసి జరుపుకొన్న అగ్రకథానాయకుడు చిరంజీవి.. దోశలు వేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను చిరుతో పాటు మిగతా మెగాహీరోలు, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
చిరంజీవి దోశ
ప్రస్తుతం చిరంజీవి.. ఆచార్య, గాడ్‌ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. వరుణ్‌తేజ్ 'గని' రిలీజ్ కావాల్సి ఉంది. వైష్ణవ్‌తేజ్.. ఓ సినిమాలో నటిస్తున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Jan 14, 2022, 5:19 PM IST