తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అంతకు మించిన సంతృప్తి మరొకటి లేదు' - చిరు ఆచార్య

తన రక్తదానం చేసిన ఫొటోలతో ఓ వీడియో రూపొందించిన కథానాయకుడు చిరంజీవి.. బ్లడ్ డొనేషన్​లో భాగమవుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

'అంతకు మించిన సంతృప్తి మరొకటి లేదు'
మెగాస్టార్ చిరంజీవి

By

Published : Jun 14, 2020, 11:58 AM IST

ఒకరి జీవితాన్ని కాపాడడానికి మించిన సంతృప్తి మరొకటి లేదని అగ్రహీరో చిరంజీవి అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన ఓ ప్రత్యేక వీడియోను ట్వీట్ చేశారు. మొదటి నుంచి ఇప్పటివరకూ తాను రక్తదానం చేసిన ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. రక్తదానం చేసిన సందర్భాలన్నీ తనకు ఎంతో సంతోషాన్ని, జీవితంలో ఓ సంతృప్తిని ఇచ్చాయని ఆయన తెలిపారు.

'రక్తదానం చేసి వేరొకరి జీవితాన్ని కాపాడడానికి మించిన ఆనందం జీవితంలో ఏముంటుంది. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని, చాలామంది తమ రక్తాన్ని దానం చేస్తున్నారని విని సంతోషిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగమవుతోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రక్త దానం చేయండి! ప్రాణదాతలు కండి!' అని చిరంజీవి ట్విట్టర్​లో రాసుకొచ్చారు.

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు రక్తాన్ని దానం చేస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలోనూ చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు రక్తదానం చేశారు.

'సైరా నరసింహారెడ్డి' తర్వాత చిరంజీవి నటిస్తోన్న సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇందులో చిరు సరసన కాజల్‌ కనిపించనుంది. కొణిదెల ప్రొడెక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details