'ఉప్పెన'(uppena) చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన నటుడు వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ యువ కెరటం మొదటి సినిమాతో వావ్ అనిపించుకున్నాడు. ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వైష్ణవ్ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కొంత సమయం ముచ్చటించారు. ఇందులో భాగంగా తన మనసులోని మాటను బయటపెట్టారు. వైష్ణవ్ పంచుకున్న ఆ విశేషాలు మీకోసం..
మీకు క్రికెట్ ఇష్టమేనా? మీకిష్టమైన క్రికెటర్ ఎవరు?
నాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. నేను బ్యాట్స్‌మేన్. నా అభిమాన క్రికెటర్ ధోనీ. ఐపీఎల్‌లో(IPL) చెన్నై సూపర్‌కింగ్స్(CSK) టీమ్ నా ఫేవరెట్
మీ చిరునవ్వుకు కారణమేమిటి?
ఎదుటివాళ్ల ఆనందంలో నా చిరునవ్వు దాగుంది.
బర్గర్ లేదా పిజ్జా? టీ లేదా కాఫీ? రెస్టారెంట్ ఫుడ్ లేదా స్ట్రీట్ ఫుడ్?
స్ట్రీట్ ఫుడ్‌ని నేను ఇష్టంగా తింటాను. అలాగే బర్గర్, పిజ్జా, కాఫీ, టీ ఇవన్నీ ఇష్టమే.
మీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందా?
లేదు
మీ అభిమాన హీరో ఎవరు? సినిమా ఏమిటి?
రజనీకాంత్(Rajnikanth) సర్ అంటే నాకెంతో ఇష్టం. ఆయన నటించిన ‘శివాజీ’ నా ఆల్‌టైమ్ ఫేవరెట్
మీకు ఇష్టమైన ఆహారం?
అన్నం, టమాట పచ్చడి
‘ఉప్పెన’లో మీకిష్టమైన సన్నివేశం ఏమిటి?
బేబమ్మ.. ఆసిని మొదటిసారి చూసినప్పుడు వచ్చే ఫైట్ సీన్
మీరు పరీక్షల్లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా?
చాలాసార్లు పరీక్షల్లో తప్పాను.
మీ తదుపరి చిత్రాలేమిటి?
క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా మొదలు కానుంది. అలాగే భవిష్యత్తులో చాలా ప్రాజెక్ట్‌లు వరుసకట్టనున్నాయి.
మీకిష్టమైన కలర్? ప్రదేశం?
బ్లూ కలర్ అలాగే థాయ్‌లాండ్‌లోని phuket అంటే ఇష్టం
మీకిష్టమైన హీరోయిన్?
నజ్రియా(Nazriya nazim)