తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాస్యభరిత వెబ్​సిరీస్​లో నటి మీనా - మీనా వెబ్​సిరీస్​

టాలీవుడ్​ అందాల తార మీనా.. మెుదటిసారిగా ఓ వెబ్​సిరీస్​లో​ నటించేందుకు సిద్ధమైంది. 'కరోలిన్​ కామాక్షి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్​లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

నటి మీనా

By

Published : Sep 9, 2019, 11:21 AM IST

Updated : Sep 29, 2019, 11:19 PM IST

వెండితెరపై అలరించి, ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించిన అందాల తార మీనా.. డిజిటల్​ వీక్షకులనూ ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. 'కరోలిన్​ కామాక్షి' అనే వెబ్​సిరీస్​తో త్వరలో మన ముందుకు రానుంది. హాస్యాన్ని పండించే సీబీఐ ఏజెంట్ ​పాత్రలో ఈ నటి కనిపించనుందని సమాచారం.

ఇందులో ఇటలీ మోడల్​ జార్జియా ఆండ్రియానా ప్రధాన పాత్రలో నటిస్తోంది. వివేక్​ కుమార్​ కన్నన్​ దర్శకత్వం వహిస్తున్నాడు. వెండితెరతో పాటూ బుల్లితెరపైనా మంచి పేరు తెచ్చుకున్న మీనా.. ప్రస్తుతం మలయాళ సూపర్​స్టార్​ మమ్ముట్టి సరసన 'షైలాక్'​ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదీ చూడండి: 'ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలే సామ్​కు ఇష్టం'

Last Updated : Sep 29, 2019, 11:19 PM IST

ABOUT THE AUTHOR

...view details