హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీస్తున్న తొలి చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఇటీవలే వచ్చిన టీజర్‌తో అంచనాలు పెరిగాయి.ఈ సినిమాను నవంబరు 1న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడు. వాణి భోజన్ హీరోయిన్గా కనిపించనుంది.
"మంచోడు అనే ఇమేజ్ను కాపాడుకునేందుకు ప్రతి మనిషి చూస్తుంటాడు. చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత హాస్యం పండిందనేది నవంబర్ 1న తెరమీద చూడబోతున్నారు. ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ కథాంశాన్ని అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది" -వర్ధన్ దేవరకొండ, హీరో-నిర్మాత