తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్: ప్రతీ ఫోన్​లో ఓ రహ్యసముంటుంది - మీకు మాత్రమే చెప్తా

దర్శకుడు తరుణ్ భాస్కర్​ హీరోగా పరిచయమవుతున్న 'మీకు మాత్రమే చెప్తా' టీజర్​ విడుదలైంది. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ నిర్మాత కావడం విశేషం.

మీకు మాత్రమే చెప్తా టీజర్

By

Published : Sep 6, 2019, 6:48 PM IST

Updated : Sep 29, 2019, 4:25 PM IST

స్టార్​హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీస్తున్న తొలి సినిమా 'మీకు మాత్రమే చెప్తా'. 'పెళ్లి చూపులు'తో తనకు బ్రేక్​ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్​ను.. ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు. టీజర్​ను శుక్రవారం విడుదల చేశారు. ఫోన్ గురించే మొత్తం ఉంటూ హాస్యభరిత సన్నివేశాలతో ప్రేక్షకుల్ని నవ్విస్తోంది.

"నీలాంటి వాళ్లు.. బ్రౌజరీ హిస్టరీ డిలీట్ చేస్తారు. కాల్ హిస్టరీ డిలీట్ చేస్తారు. వాట్సాప్ చాట్ డిలీట్ చేస్తారు. అన్ని దాచేసి దొరికిపోతే చీటింగ్ కాదంటారు","ప్లీజ్​ నా గురించి తప్పుగా ఆలోచించొద్దు రా, బేసిగ్గా నేను మంచోడ్ని","పొగతాగడం, మద్యం సేవించడం, అబద్ధం ఆడటం ఆరోగ్యానికి హానికరం" అంటూ సాగే సంభాషణలు ఆలరిస్తున్నాయి.

ఇందులోని ఇతర పాత్రల్లో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ నటిస్తున్నారు. శివ కుమార్ సంగీతమందిస్తున్నాడు. షమీర్ సుల్తాన్​ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇది చదవండి: వెంకటేశ్ నవ్వుల హంగామాకు 18 ఏళ్లు

Last Updated : Sep 29, 2019, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details