2017లో ప్రపంచసుందరిగా నిలిచిన మానుషీ చిల్లర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ సెక్సీయస్ట్ వెజిటేరియన్ పర్సనాలిటీగా ఎంపికైంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏనిమల్స్) సంస్థ ప్రకటించింది. దీనిపై మానుషీ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
సెక్సీయస్ట్ వెజిటేరియన్ పర్సనాలిటీగా మానుషీ - హర్యానా మాజీ ప్రపంచసుందరి మానుషీ చిల్లర్
ప్రపంచ సెక్సీయస్ట్ వెజిటేరియన్ పర్సనాలిటీగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఎంపికైంది. ఓటింగ్‌లో అధికంగా ఆమెకు మొగ్గు చూపారని అమెరికన్ జంతుహక్కుల సంస్థ (పెటా) ప్రకటించింది.
"శాకాహారిగా ఉండటం నా జీవన విధానం. నా తల్లిదండ్రులూ శాకహారులే. వారి నుంచే నాకు ఈ అలవాటు వచ్చింది. అందులో నుంచి మారాల్సిన అవసరం ఇప్పటి వరకు రాలేదు. కూరగాయల్లో చాలా పోషకాలు ఉంటాయని నమ్ముతాను. కొవ్వు, రక్తపోటు వంటి వాటిని నియంత్రించే ప్రయోజనాలు అందులో ఉన్నాయి. జంతు ప్రేమికురాలిగా, శాకాహారిగా.. ప్రస్తుతం చాలా ఆనందజీవితాన్ని గడుపుతున్నా"
- మానుషీ చిల్లర్, మాజీ ప్రపంచసుందరి
మానుషీ.. ప్రస్తుతం యష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పృధ్వీరాజ్'తో బాలీవుడ్‌కు పరిచయమవుతోంది. చారిత్రక కథాంశంతో తీస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ హీరో. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.