తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫ్యామిలీ మ్యాన్​ నటుడి ఇంట్లో విషాదం - మనోజ్​ బాజ్​పాయ్​ తండ్రి మరణం

ఫ్యామిలీ మ్యాన్​ 2 వెబ్​సిరీస్​ కథానాయకుడు మనోజ్​ బాజ్​పాయ్​ (Manoj Bajpayee News) నివాసంలో విషాదం నెలకొంది. అతని తండ్రి ఆర్​కే బాజ్​పాయ్​ (Manoj Bajpayee Father) ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని బాలీవుడ్​ డైరెక్టర్​ అవినాష్​ దాస్​ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

Manoj Bajpayee's father passes away
మనోజ్‌ బాజ్‌పాయ్‌

By

Published : Oct 3, 2021, 2:27 PM IST

బాలీవుడ్​ విలక్షణ నటుడు మనోజ్​ బాజ్​పాయ్​కి (Manoj Bajpayee News) పితృవియోగం కలిగింది. మనోజ్​ తండ్రి ఆర్​కే బాజ్​పాయ్​ (Manoj Bajpayee Father) మరణించారు. అనారోగ్యం కారణంగా ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు డైరెక్టర్​ అవినాష్​ దాస్​ ట్వీట్​ చేశారు. దీనిపై స్పందించిన పలువురు సినీ తారలు మనోజ్​కు సంఘీభావం తెలిపారు.

"మనోజ్ భయ్యా తండ్రి ఇక లేరు. అతనితో గడిపిన క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవి మరలా తిరిగి రావు. ఈ చిత్రాన్ని నేను భీతిహర్వ ఆశ్రమంలో తీశాను. ఓర్పు కలిగిన గొప్ప వ్యక్తి అతను. తన కొడుకు విజయానికి ఎల్లప్పుడూ దూరంగా ఉంటూ.. నిరాడంబర జీవితం గడిపేవారు."

- అవినాష్​ దాస్​, డైరెక్టర్​

సెప్టెంబర్​లో మనోజ్​ తండ్రి అనారోగ్యం పాలయ్యారు. దీంతో అకస్మాతుగా కేరళ నుంచి దిల్లీ వెళ్లి తండ్రిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. అంతిమసంస్కారాలు దిల్లీలోని నిఘంభోద్​ ఘాట్​లో జరగనున్నాయి.

మనోజ్ బాజ్​పాయ్​ చివరిగా వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (Family Man 2) లో కనిపించారు. కమల్ రషీద్ ఖాన్‌పై పరువు నష్టం దావా వేసిన తర్వాత మనోజ్​ వార్తల్లో నిలిచారు.

ఇదీ చూడండి:'చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం'

ABOUT THE AUTHOR

...view details