టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం మన్మథుడు 2. తాజాగా ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
'ఏదైనా.. జరగాల్సిన వయసులోనే జరగాలి' - king
నాగార్జున, రకుల్ ప్రీత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మన్మథుడు 2. ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
నాగార్జున
ఆద్యంతం హాస్యభరితంగా సాగుతున్న ఈ సినిమా టీజర్ నవ్వులను పూయిస్తుంది. 'ఏదైనా.. జరగాల్సిన వయసులోనే జరిగితే బాగుంటుంది' అంటూ సాగుతున్న డైలాగ్లు అలరిస్తున్నాయి. 'ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ ఓన్లీ మేక్ లవ్' అంటూ చివర్లో నాగార్జున తనదైన మార్కును చూపించాడు.
2002లో విజయవంతమైన 'మన్మథుడు' చిత్రానికి సీక్వెల్గా తెరెకెక్కుతోన్న ఈ సినిమాను నాగర్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేశ్, లక్ష్మీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.