తెలంగాణ

telangana

By

Published : Mar 18, 2021, 4:12 PM IST

ETV Bharat / sitara

'నారప్ప' నుంచి తప్పుకున్న మణిశర్మ?

వెంకటేశ్ 'నారప్ప' నుంచి సంగీత దర్శకుడు మణిశర్మ తప్పుకున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏమైంది?

Mani Sharma walks out of Narappa
'నారప్ప' నుంచి తప్పుకున్న మణిశర్మ?

విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో 'ఎఫ్3', 'దృశ్యం 2' రీమేక్​తో పాటు 'నారప్ప' ఉన్నాయి. అయితే 'నారప్ప'కు సంగీతమందిస్తున్న మణిశర్మ.. సృజనాత్మక విభేదాల కారణంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఇంతకీ ఏమైంది?

తమిళ హిట్​ 'అసురన్'కు తెలుగు రీమేక్ 'నారప్ప'. వెంకటేశ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. గతేడాది థియేటర్లలోకి రావాల్సినప్పటికీ కొవిడ్ కారణంగా వాయిదా పడింది.

గత డిసెంబరులో సినిమా గ్లింప్స్ విడుదలవగా, ఒరిజినల్ సినిమాలోని బ్యాక్​గ్రౌండ్​ స్కోరు అందులో ఉండటం వల్ల కాపీ కొట్టారంటూ మణిశర్మపై విమర్శలు వచ్చాయి. తన ట్యూన్ కాకుండా మాతృకలోనిది పెట్టడం వల్ల అప్పటి నుంచి మణిశర్మ, చిత్రబృందంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details