'నవరస' వెబ్‌సిరీస్‌ను దర్శకుడు జయేంద్రతో కలిసి నిర్మించిన మణిరత్నం మరో అగ్ర దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్, మణిరత్నం కలిసి రెయిన్ ఆన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో మరికొందరు తమిళ దర్శకులు కూడా భాగం కానున్నారు. వారిలో వెట్రిమారన్, గౌతమ్ మేనన్, లింగుస్వామి, మిస్కిన్, శశి, వసంత బాలన్, లోకేష్ కనగరాజ్, బాలాజీ శక్తివేల్, మురుగదాస్ తదితరులు ఉన్నారు.
తమిళ స్టార్ డైరెక్టర్స్ మరోసారి కలిసి.. - కోలీవుడ్ న్యూస్
కోలీవుడ్ ప్రముఖ దర్శకులు మణిరత్నం, శంకర్లు కలిసి ఓ నిర్మాణసంస్థను ప్రారంభించారు. ఇందులో వారితో పాటు మరికొందరు దర్శకులు భాగం కానున్నారు. ప్రతిభ ఉన్న దర్శకులను ప్రోత్సహించి.. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మించడమే లక్ష్యంగా ఈ సంస్థ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
నిర్మాణరంగంలోకి కోలీవుడ్ ప్రముఖ దర్శకులు
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను ఈ సంస్థ నిర్మించనుంది. ప్రతిభ ఉన్న దర్శకులకు అవకాశాలు కల్పించడం కోసం ఈ సంస్థను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సంస్థలో తొలి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన ప్రస్తుతం కమల్‌హాసన్‌తో 'విక్రమ్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయ్యాకా రెయిన్ ఆన్ ఫిలిమ్స్ ప్రై.లిలో సినిమా పట్టాలెక్కనుంది.
ఇదీ చూడండి..'నవరస' మేకింగ్ వీడియో చూసేయండి!