తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తనను తలుచుకుంటే.. గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది' - విరానిక రెడ్డి

భార్య విరానికాను చూసిన క్షణాలు గుర్తొస్తే ఇప్పటికీ ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుందని చెప్పారు హీరో మంచు విష్ణు. మంగళవారం ఆయన పుట్టిన రోజు (Manchu Vishnu Birthday). ఈ సందర్భంగా తన జీవిత భాగస్వామి గురించి విష్ణు చెప్పిన విశేషాలు.

manchu vishnu birthday
మంచు విష్ణు

By

Published : Nov 23, 2021, 1:00 PM IST

తొలి చిత్రం 'విష్ణు'తోనే ఫిల్మ్​ఫేర్ అవార్డు అందుకున్న నటుడు మంచు విష్ణు. అప్పటి నుంచి నటుడిగా, నిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చిన అతడు.. ఇటీవలే 'మా' అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యారు. మంగళవారం ఆయన పుట్టిన రోజు (Manchu Vishnu Birthday). విష్ణుకు విరానికతో (Manchu Vishnu Wife) 2009లో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలున్నారు (Manchu Vishnu Family). అయితే.. విరానికను తొలిసారి చూసిన క్షణాలు గుర్తుకు వస్తే.. ఇప్పటికీ ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని చెప్పాడు విష్ణు.

భార్య విరానికతో విష్ణు

"నాకు ఈ రోజుకీ గుర్తు.. ఆ అమ్మాయి (విరానిక) నవ్వు, మాట్లాడే మాటలు. దేవుడా.. ఈ రోజుటికీ తలుచుకుంటే.. నా గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగిపోతుంది. తనను చూసే సమయంలో మా నాన్న (మోహన్ బాబు) గుర్తుకు రాలేదు. అయితే ఆ తర్వాత నాన్నకు ఎలా చెప్పాలనే టెన్షన్ మొదలైంది." అని చెప్పాడు విష్ణు. ఈ విశేషాలను ఇటీవలే 'అలీతో సరదాగా' షోలో పాల్గొన్న సందర్భంగా వెల్లడించాడు విష్ణు.

విష్ణు కుటుంబం

నటుడిగా.. 'ఢీ', 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' వంటి హిట్​ చిత్రాల్లో నటించాడు విష్ణు (Manchu Vishnu Movies). ఇటీవలే 'మోసగాళ్లు' అనే చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. తండ్రి మోహన్​ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న 'సన్​ ఆఫ్​ ఇండియా' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రభాస్​తో విష్ణు దంపతులు

ఇదీ చూడండి:హీరోయిన్లను అవమానిస్తే అస్సలు ఊరుకోను: మంచు విష్ణు

ABOUT THE AUTHOR

...view details