తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వారంలో ఓ శుభవార్త వింటారు: మంచు మనోజ్​ - Manchu Manoj

కొద్ది రోజుల్లో అందరూ శుభవార్త వింటారని అంటున్నాడు కథానాయకుడు మంచు మనోజ్​. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Manchu Manoj- good news- with in a week
వారంలో శుభవార్త వింటారు: మంచు మనోజ్​

By

Published : Jan 28, 2020, 6:30 PM IST

Updated : Feb 28, 2020, 7:35 AM IST

మంచు మనోజ్‌ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయినా సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులను పలకరిస్తున్నాడు. తాజాగా "అన్ని కుదిరాయి. వారంలో ఓ శుభవార్త వినిపించబోతున్నా. వేచి చూడండి" అని ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. ఈ వ్యాఖ్యతో పాటు తన ఫొటో షేర్‌ చేశాడు. త్వరలో అతడు తన తర్వాతి ప్రాజెక్టు వివరాలు వెల్లడిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ పోస్టు చూసిన నెటిజన్లు 'ఆల్‌ ది బెస్ట్','కంగ్రాట్స్','త్వరగా చెప్పండి మనోజ్‌' అని కామెంట్లు పెడుతున్నారు. మరో నెటిజన్​ అయితే 'ఏంటి ఇంకో పెళ్లా?' అని అడిగాడు. దానికి 'వామ్మో' అని సమాధానం ఇచ్చాడు మనోజ్‌. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. మనోజ్‌ ఏం చెప్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇటీవలే మనోజ్‌ దంపతులు విడాకులు తీసుకున్నారు.

ఇదీ చూడండి.. మోదీ తర్వాత అడవుల్లో సాహస యాత్రకు రజనీ

Last Updated : Feb 28, 2020, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details