మోహన్‌బాబు తనయగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన మంచు లక్ష్మి.. వ్యాఖ్యాతగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి చిత్రం 'అనగనగా ఓ ధీరుడు'తో ప్రతినాయకురాలు ఐరేంద్రిగా నటించి అందరి ప్రశంసలూ అందుకోవడమే కాదు, ఉత్తమ విలన్‌గా నంది అవార్డును కూడా అందుకున్నారు.
మంచు లక్ష్మి ఇంటిని చూశారా? - manchu laxmi instagram
వ్యాఖ్యాత, నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ పలు ఆసక్తికరమైన విశేషాలను తెలుపుతుంటారు. ఈ సారి 'మై హోమ్ టూర్'(Manchu Lakshmi Home Tour) పేరుతో తన ఇంటి విశేషాలను ఓ వీడియోలో పొందుపరిచి షేర్ చేశారు. ఆ వీడియోను చూసేద్దాం..
ఇక సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చేరువగా ఉంటారు మంచు లక్ష్మి. తన కుమార్తెతో కలిసి వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తుంటారు. వ్యాయామాలు, యోగా ఇలా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తుంటారు. తాజాగా తన ఇంటి(Manchu Lakshmi home tour) గురించి విశేషాలను పంచుకున్నారు. 'మై హోమ్ టూర్' అంటూ తన ఇల్లు ఏవిధంగా ఉంటుంది? ఆఫీస్ ఎలా ఉంటుంది? సినిమాలు ఎక్కడ చూస్తారు? తన వార్డురోబ్‌లో ఏమేం వస్తువులు ఉంటాయో చూపించారు. ఇంకెందుకు ఆలస్యం 'చలో మంచు లక్ష్మి ఇంటికి'.
ఇదీ చూడండి: బ్లూ డ్రెస్సులో మంచు లక్ష్మీ ఫోజులు