తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మంచు లక్ష్మి కుమార్తె పాటకు నెట్టింట ప్రశంసలు - latest cinema news

ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి కుమార్తె నిర్వాణ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్​​ అవుతోంది. అందుకు కారణం తాను పాడిన పాట. ఎంతబాగా పాడిందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ నటి సమంత కూడా నిర్వాణ గాత్రానికి స్పందించింది. ఇంతకి ఆ పాటేంటో తెలుసా?

manchu lakshmi instagram followers respond on her daughters singing
మంచు లక్ష్మి కుమార్తె పాటకు నెట్టింట ప్రశంసలు

By

Published : Feb 29, 2020, 8:50 AM IST

Updated : Mar 2, 2020, 10:36 PM IST

నటి మంచు లక్ష్మి కుమార్తె నిర్వాణ తన గాత్రంతో నెటిజన్ల మనసులు దోచుకుంది. పాప అమ్మవారి కీర్తన 'అయిగిరి నందిని..' పాడుతున్న వీడియోను మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇది తన పాప తొలి పాటని తెలిపింది.

'పాటను విని, ప్రశంసించిన వారందరికీ నా ధన్యవాదాలు. మీ కామెంట్లతో నాకు కన్నీరు తెప్పించారు. తన ఆసక్తిని ప్రోత్సహించే సమాజంలో నా కుమార్తె పెరుగుతుండటం ఓ తల్లిగా చాలా సంతోషంగా ఉంది. నా చిట్టితల్లి విషయంలో చాలా గర్వంగా ఉన్నాను. ఆమె ఓ స్టార్‌’

మంచి లక్ష్మి, సినీ నటి

పాప స్వరం చాలా బాగుందని నెటిజన్లు వరుస కామెంట్లు చేశారు. 'పాటను చాలా స్పష్టంగా పాడింది, పాటతో పాటు తను పలికించిన హావభావాలు అందంగా ఉన్నాయి, నిర్వాణ అదరగొట్టేసింది నిజంగా అద్భుతం..' అంటూ రకరకాల కామెంట్లు చేశారు. నిర్వాణ పాట విన్న సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో స్పందించింది. 'నా క్యూటీ కేవలం నువ్వే.. షైన్‌' అని పోస్ట్‌ చేసింది.

Last Updated : Mar 2, 2020, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details