ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పోస్ట్ చేసిన గాయాల ఫొటోలపై నటి మంచు లక్ష్మి వివరణ ఇచ్చారు. తనకెలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.
ఇంతకీ ఏమైందంటే?
ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పోస్ట్ చేసిన గాయాల ఫొటోలపై నటి మంచు లక్ష్మి వివరణ ఇచ్చారు. తనకెలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.
ఇంతకీ ఏమైందంటే?
మంచు లక్ష్మి ఇటీవల ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫొటోల్ని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. వీటిల్లో ఆమె చేతికి, మోకాలికి గాయాలు కనిపించాయి. దాంతో ఆమె అభిమానులు, నెటిజన్లు లక్ష్మికి ఏమైందోనని ఆరా తీయడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఆమె అసలు విషయాన్ని బయటపెట్టారు.
'ఆ ఫొటోలు సినిమా చిత్రీకరణకు సంబంధించినవి. నాకెలాంటి ప్రమాదం జరగలేదు. నాపై ఇంత ప్రేమ, అభిమానం చూపిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు' అని మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె మలయాళీ నటుడు మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కీలకపాత్ర చేస్తున్నారు.
ఇవీ చదవండి: