కల్పిత కథలు, వాస్తవ సంఘటనలు, పుస్తకాలు.. ఇలా అనేక ఆధారాలతో తీసే చిత్రాలు వెండితెరపై రూపుదాల్చుకుంటాయి. ఇప్పుడంటే నవల ఆధారంగా వచ్చే సినిమాలు తక్కువ. కానీ ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా ఇష్టపడే నవలలను చిత్రాలుగా తెరకెక్కించేవారు. ఇలా వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి.
ముఖ్యంగా బెంగాలీ నవలలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు 'దేవదాసు’, ఎన్టీఆర్ 'ఆరాధన' ఈ కోవకు చెందినవే. బెంగాలీ నవలల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాలు.. తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. మరపురాని సినిమాలుగా నిలిచిపోయాయి.