తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రష్యన్​ భాషలోకి మెగాస్టార్ 'మాస్టర్​పీస్​'

మమ్ముట్టి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'మాస్టర్​పీస్​' సినిమాను రష్యన్​లోకి అనువదిస్తున్నారు. ఈ​ భాషలోకి అనువాదమవుతున్న తొలి మలయాళ సినిమా ఇదే కావడం విశేషం.

Mammootty's ' Masterpiece' to be dubbed in Russian
రష్యన్​లోకి అనువాదం అవుతున్న మమ్ముట్టి 'మాస్టర్​పీస్​'

By

Published : May 27, 2020, 2:37 PM IST

ప్రముఖ మలయాళీ నటుడు, మెగాస్టార్ మమ్ముట్టి యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'మాస్టర్‌పీస్‌'. దీనిని ప్రస్తుతం రష్యన్‌లోకి అనువాదిస్తున్నారు. ఈ భాషలోకి అనువాదం అవుతున్న మొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు అజయ్‌ వాసుదేవ్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

2017లో క్రిస్​మస్​ సందర్భంగా విడుదలైన 'మాస్టర్​పీస్'.. బాక్సాఫీస్​ వద్ద ఘనవిజయం సాధించింది. ఇందులో మమ్ముట్టితో పాటు ఉన్ని కృష్ణన్, ముఖేష్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, పూనం బజ్వా తదితరులు నటించారు.

ఇదీ చూడండి...'ఆ సినిమా ఇప్పుడు వస్తే 'బాహుబలి-2'ను దాటేస్తుంది'

ABOUT THE AUTHOR

...view details