ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ యువనటుడు బాసిల్ జార్జ్(30) మృతి చెందాడు. ఇతడితో పాటే ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. డ్రైవర్ తప్పిదం వల్లనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదంలో యువ హీరో మృతి - Malayalam actor Basil George, 30, dies in road accident
మలయాళ యువహీరో బాసిల్ జార్జ్(30) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గతేడాది వచ్చిన 'పూవల్లియమ్ కుంజడమ్' సినిమాతో అరంగేట్రం చేశాడీ నటుడు.
రోడ్డు ప్రమాదంలో యువ నటుడు మృతి
బాసిల్తో పాటు నలుగురు స్నేహితులు.. కొలెన్చెర్రీ నుంచి మువట్టుపుళకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మార్గమధ్యమంలో మెక్కడంబు ప్రాంతంలో అదుపుతప్పి తొలుత కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు... ఆ తర్వాత పక్కనే ఉన్న భవంతిలోకి దూసుకెళ్లింది. సంఘటనా స్థలంలో ఇద్దరు మరణించగా, చికిత్స పొందుతూ జార్జ్ మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గతేడాది వచ్చి 'పూవల్లియమ్ కుంజడమ్' సినిమాతో అరంగేట్రం చేశాడు జార్జ్.