ఈ ఏడాది ఖరారైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రామ్‌చరణ్-శంకర్ సినిమా ఒకటి. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్న ఈ చిత్రం గురించి తరచూ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం చరణ్‌కి జోడీగా నటించనున్న కథానాయిక ఎంపికపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
శంకర్-చరణ్ చిత్రం కోసం మాళవిక! - మాళవిక మోహనన్ రామ్ చరణ్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఓ చిత్రం తెరకెక్కించబోతున్నారు. అయితే ఇందులో చరణ్ పక్కన నటించబోయే హీరోయిన్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. తాజాగా మాళవిక మోహనన్‌ను ఈ మూవీ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.
చరణ్‌తో మాళవిక మోహనన్
రష్మిక మందన్న మొదలుకొని పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మాళవిక మోహనన్ పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ కథానాయకుడిగా నటించిన 'మాస్టర్' చిత్రంతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది. మరి శంకర్ ఈమెకే ఓటేస్తాడా? లేక మరో భామని పరిశీలిస్తారా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.