బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇన్‌స్టాలో ఓ కొత్త పోస్ట్ చేసి అభిమానులందరినీ ఆలోచనల్లో పడేసింది. నెటిజన్లు దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే?
మలైకా.. ఓ డైమండ్ ఉంగరం ధరించి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. "ఇలాంటి ఉంగరం ధరించడం నా కల. నేను దీనిని చాలా ఇష్టపడుతున్నాను.. ఆనందం ఇక్కడే మొదలైంది. మీ జీవతంలో ప్రేమను పొందాలంటే ఇలాంటి ఉంగరాన్ని ధరించాలి" అంటూ వ్యాఖ్య జోడించింది.
దీంతో ఆమెకు తన బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో నిశ్చితార్థం జరిగి ఉంటుందేమోనని అనేక మంది ఊహించుకుంటున్నారు. "హేయ్, మీకు అర్జున్‌కు నిశ్చితార్థం జరిగిందా?', 'మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి' అంటూ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. నిజానికి మలైకా చేసిన ఆ పోస్ట్.. ఓ జ్యూవెలరీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమె ఈ ఫొటో దిగారు. ఇది తెలియక నెటిజన్లంతా ఈ విధంగా ఊహించుకుంటున్నారు.
అర్జున్ కపూర్, హీరోయిన్ మలైకా అరోరా జోడీ గురించి ఇప్పటికే చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, సహజీవనం కూడా చేస్తున్నారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే తమ బంధంపై ఈ జోడీ ఎలాంటి విషయం ఇప్పటివరకు చెప్పలేదు. మాటల్లో చెప్పకపోయినా.. సోషల్ మీడియా ఖాతాల్లో వీరి పోస్టులు చూసిన వారు.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని చాలారోజులుగా అనుకుంటున్నారు.
ఇదీ చూడండి: 'అతడితో క్వారంటైన్ అస్సలు బోర్ కొట్టలేదు'