మహీంద్రా ట్రాక్టర్స్... బహుశా దేశంలో ఈ పేరు తెలియని వారుండరు. భారత్లోని ప్రతి ఊరిలో ఈ ట్రాక్టర్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది. ఎందుకంటారా?
ఇటీవల ఆస్కార్ అవార్డు సాధించిన మినారీ అనే కొరియన్ మూవీలో ఈ ట్రాక్టర్ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోను భారత విదేశాంగ శాఖ యూరప్-వెస్ట్రన్ వ్యహారాల జాయింట్ సెక్రటరీ సందీప్ చక్రవర్తి ట్విట్టర్లో పోస్టు చేశారు.
"మహీంద్రా కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు శుభాకాంక్షలు. భారత్ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినందుకు ఆనందంగా ఉంది#UngoogleableQuiz . ఈ చిత్రం ఆస్కార్ గెలిచిన మినారీ అనే కొరియన్ సినిమాలోనిది."
-సందీప్ చక్రవర్తి, భారత విదేశాంగ శాఖ
భారత్ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినందుకు ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు సిద్ధార్థ్ బసు అనే టెలివిజన్ నిర్మాత.