తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కర్నూలు బురుజు ముందు మహేశ్​ గొడ్డలివేట...! - MAHESH BABU NEW LOOK IN SARILERU NEKEVVARU

'సరిలేరు నీకెవ్వరు' చిత్రం నుంచి కొత్త లుక్​ విడుదలైంది. కర్నూలు బురుజు ముందు మహేశ్​ గొడ్డలి పట్టుకొన్న స్టిల్​ ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కర్నూలు బురుజు ముందు మహేశ్​ గొడ్డలివేట...!

By

Published : Oct 7, 2019, 5:23 PM IST

టాలీవుడ్​ ప్రిన్స్​ మహేశ్​బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం నుంచి పవర్​ఫుల్​ లుక్​ విడుదలైంది. ఇందులో కర్నూలు బురుజు ముందు గొడ్డలి పట్టుకొని కనిపించాడు ప్రిన్స్​. ఈ సినిమాలో మహేశ్​ సరసన రష్మిక మందణ్న కథానాయిక పాత్ర పోషిస్తోంది. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, నరేశ్‌, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి కొత్త పోస్టర్​

దిల్‌రాజు, మహేశ్‌బాబు, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

మరింత హ్యాండ్సమ్​గా...

మహేశ్​బాబు రాకింగ్​ లుక్​లో కనిపిస్తోన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓ ప్రముఖ సంస్థ మ్యాగజైన్​ కవర్​పేజీ కోసం ఇటీవల ఫొటోషూట్​లో పాల్గొన్నాడీ సూపర్​స్టార్​. ఈ కొత్త స్టిల్స్​లో మహేశ్​ మరింత హ్యాండ్సమ్​గా దర్శనమిచ్చాడు. 44 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా ఆకట్టుకుంటున్నాడు.

హ్యాండ్సమ్​ లుక్​లో మహేశ్​బాబు

ఇదీ చదవండి...

ABOUT THE AUTHOR

...view details