లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ నుంచి బ్రేక్ దొరకడం వల్ల తనయుడు గౌతమ్, కుమార్తె సితారతో సరదాగా గడుపుతున్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. ఫిట్‌నెస్ కోసం వర్కౌట్లు చేయడం సహా తన పిల్లలతో కలిసి ఆటలు ఆడటం, ఈత కొట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా మహేశ్ తన తనయుడు గౌతమ్‌తో హైట్ చెక్ చేసుకున్నారు. గౌతమ్ ఎదురుగా నిల్చుని సరదాగా ఎత్తు కొలుచుకుంటున్న ఓ వీడియోను సూపర్‌స్టార్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఆరడుగుల మహేశ్ ఎత్తుకు గౌతమ్ ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారు. "హైట్ చెక్!! హి ఈజ్ టాల్, లాక్‌డౌన్‌లో కొంచెం ఫన్నీగా.." అని మహేశ్ పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన ప్రిన్స్ అభిమానులు.. "సూపర్, ఈట్స్ కూల్, లాక్‌డౌన్ డైరీస్, హ్యాపీ ఫ్యామిలీ, సూపర్‌స్టార్ హైట్‌కి ఏమాత్రం తీసిపోలేదుగా..!" అని అంటున్నారు.
మహేశ్‌కు పోటీగా గౌతమ్.. ఎవరు గెలిచారు! - గౌతమ్ ఘట్టమనేని
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ఆయన కుమారుడు గౌతమ్‌లు హైట్‌ను పోల్చుకుంటున్నారు. అయితే ఆరడుగులకు ఎవరూ తీసిపోకుండా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు మహేశ్.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేశ్ నటించారు. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మెప్పించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన తదుపరి చిత్రాల గురించి మహేశ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ ఓ సినిమాలో నటించనున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత మహేశ్-రాజమౌళి చిత్రం ప్రారంభం కానుందని సమాచారం.
ఇదీ చూడండి... స్వప్నలోక సంచారి.. ఆనంద విహారి ఈ దర్శకేంద్రుడు