తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మామయ్య అని పిలువు: మహేశ్​తో రాఘవేంద్రరావు - మహేశ్‌బాబు

టాలీవుడ్​ ప్రిన్స్​ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ సినిమా సక్సెస్‌ మీట్‌ ఘనంగా జరిగింది. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఈ వేడుకకు వేదికైంది. హీరో మహేశ్‌బాబు, అల్లరి నరేష్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, కథానాయిక పూజా హెగ్డే, నిర్మాతలు దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు హజరయ్యారు.

విజయవాడలో విజయోత్సవ మహర్షి

By

Published : May 19, 2019, 5:14 AM IST

విజయవాడలో జరిగిన 'మహర్షి' సినిమా విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు హీరో కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

" కృష్ణ, మహేశ్‌ అభిమానులకు ఇవాళ పెద్ద పండుగ. మీ అందరికీ ఒక్క పండుగ అయితే.. మహేశ్‌కు ఇది 25వ సినిమా కాబట్టి.. 25 పండుగలు ఒకేసారి చేసుకున్నట్లు (నవ్వుతూ). నిర్మాతలు దత్‌, దిల్‌రాజు, ప్రసాద్‌కు శుభాకాంక్షలు. మహేశ్‌.. మీ నాన్న 25 సినిమాల సందర్భంగా ఈ రోజు నిన్ను చూసి ఎంత ఆనందపడుతున్నారో.. నేను 100 సినిమాలు తీసినప్పుడు ఎంత ఆనందపడ్డానో.. ఇప్పుడు అంత సంతోషపడుతున్నా. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా".

-- కె.రాఘవేంద్రరావు, దర్శకుడు

సమాజానికి ఉపయోగపడేలా మంచి చిత్రాన్నితెరకెక్కించారంటూ దర్శకుడు వంశీ పైడిపల్లిపై ప్రశంసలు కురిపించారు రాఘవేంద్ర రావు. పూజా హెగ్డే గొప్ప హీరోయిన్‌ అవుతుందని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అల్లరి నరేష్‌ మరోసారి మంచి పాత్రతో మెప్పించాడని... ఈవీవీ సత్యనారాయణ ఇప్పుడు జీవించి ఉంటే ఎంతో సంతోషించేవారని మాట్లాడారు దర్శకేంద్రుడు.

కార్యక్రమంలో మహేశ్​, పూజా హెగ్డే, వంశీ పైడిపల్లి

మామా అని పిలువు

ప్రసంగంలో రాఘవేంద్రరావు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనని మామయ్య అని పిలవాలని మహేశ్​ను కోరారు.

"మహేశ్‌ హీరోగా రూపొందిన మొదటి సినిమా 'రాజకుమారుడు'ను అశ్వినీ దత్​ నిర్మాణంలో చేయాలనిసూపర్‌స్టార్‌ కృష్ణ చెప్పారు. ఆ సినిమాలో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మహేశ్‌ను వెండితెరకు పరిచయం చేయడం గర్వంగా ఉంది. ఏప్రిల్‌ 28న విడుదలైన ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ రికార్డులు సృష్టించాయి. మే 9న వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’, ‘మహర్షి’ హిట్‌ అయ్యాయి. ఇక నుంచి మే 9ని ‘మహర్షి’ డేగా పిలుస్తారు. ఈ ప్రయాణం ఇంతటితో ఆగదు. మహేశ్‌.. నాది చిన్న విన్నపం. ‘రాజకుమారుడు’ షూట్‌లో నన్ను మామయ్య అనేవాడివి. ఇప్పుడు నువ్వు వేదికపైకి వస్తావు, నాకు ధన్యవాదాలు చెబుతావు. నన్ను రాఘవేంద్రరావు గారు అనొద్దు.. మామయ్య అను" అని రాఘవేంద్ర రావు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details