తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రపంచకప్​ కోసం ఇంగ్లాండ్​కు చిన్నోడు, పెద్దోడు - WC19

టాలీవుడ్​ అగ్రహీరోలు వెంకటేశ్​, మహేశ్​బాబు.. త్వరలో ప్రారంభమయ్యే ప్రపంచకప్​ మ్యాచ్​లు ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమవుతున్నారు. జూన్​ 5 న దక్షిణాఫ్రికాతో భారత్​ ఆడే తొలి మ్యాచ్​కు హాజరు కానున్నారని సమాచారం.

ప్రపంచకప్​ చూసేందుకు చిన్నోడు.. తోడుగా పెద్దోడు

By

Published : May 18, 2019, 9:50 AM IST

మే 30న వన్డే క్రికెట్‌ ప్రపంచకప్​ ప్రారంభం కానుంది. అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కొందరు ఇంగ్లాండ్​ వెళ్లి ప్రత్యక్షంగానూ చూసేందుకు సిద్ధమవుతున్నారు. సినీ తారలు ఇందుకు మినహాయింపు కాదు. టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, మహేశ్​బాబు మ్యాచ్​లు చూసేందుకు త్వరలో ఇంగ్లాండ్​ వెళ్లనున్నారని సమాచారం.

ఐపీఎల్​లో హైదరాబాద్​ మ్యాచ్​లు జరిగినప్పుడు వెంకటేశ్ సందడి చేస్తూ ఉత్సాహంగా కనిపిస్తుంటాడు. ఇటీవలే మహర్షి ఇంటర్​వ్యూలో మహేశ్​ మాట్లాడుతూ.. 2011 ప్రపంచకప్​ ఫైనల్​ ప్రత్యక్షంగా చూశానని చెప్పాడు. ​

మహేశ్​బాబు- వెంకటేశ్​

జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడనుంది టీమిండియా. రౌండ్​ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో ప్రతి జట్టు మిగతా వాటితో తలో మ్యాచ్​ ఆడనుంది. జూలై 14న ప్రఖ్యాత లార్డ్స్​ మైదానంలో ఫైనల్​ పోరు జరగనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details