తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యూట్యూబ్​ ఛానెల్​ ప్రారంభించిన మహేశ్​ కూతురు - వంశీ పైడిపల్లి కూతురు ఆద్య

హీరో మహేశ్​బాబు కూతురు సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య కలిసి సొంతంగా యూట్యూబ్ ఛానెల్​ ప్రారంభించారు. తొలి వీడియోతోనే నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన మహేశ్​ కూతురు

By

Published : Jul 18, 2019, 3:59 PM IST

సూపర్ స్టార్ మహేశ్​బాబు ఇటీవలే 'మహర్షి'తో హిట్ కొట్టాడు. వంశీ పైడిపల్లి ఆ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సినిమా తీస్తున్నప్పుడే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ప్రపంచకప్​ చూసేందుకు కుటుంబాలతో సహా ఇంగ్లాండ్​ వెళ్లారు. ఇప్పుడు వీరి కుమార్తెలు ఇద్దరూ కలిసి సొంతంగా యూట్యూబ్ ఛానెల్​ను ప్రారంభించారు.

సితార-ఆద్య పేరుతో ఈ యూట్యూబ్​ ఛానెల్​ను బుధవారం లాంచ్ చేశారు. 'త్రీ మార్కర్ ఛాలెంజ్​' పేరుతో తొలి వీడియోను అప్​లోడ్ చేశారు. స్కెచ్ పెన్స్ ఆధారంగా ఈ గేమ్ రూపొందించారు. ఆటలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని బ్యాగ్​లోని మూడు స్కెచ్​లు తీసి వాటితో ఓ డ్రాయింగ్​ను పూర్తి చేయాలి. ఇందులో ఆడుతూ పాడుతూ సందడి చేసిన ఈ చిన్నారులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

ఇది చదవండి: నీటి ఆదా కోసం దర్శకుడు నాగ్​ అశ్విన్.. 'వన్ బకెట్ ఛాలెంజ్'

ABOUT THE AUTHOR

...view details