తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాములమ్మకు బర్త్​డే విషెస్ చెప్పిన మహేశ్ - vijayashanthi

విజయశాంతికి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు మహేశ్ బాబు. మహేష్​తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా శుభాకాంక్షలు చెప్పాడు.

మహేశ్

By

Published : Jun 25, 2019, 6:00 AM IST

సోమవారంవిజయశాంతిపుట్టినరోజు సందర్భంగా సూపర్​ స్టార్​ మహేష్​ బాబు శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రాములమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. మరెన్నో పుట్టినరోజులు జరపుకోవాలని ట్వీట్​ చేశాడు.

"విజయశాంతి గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. మరోసారి మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. ఈ ఏడాది మీకు గొప్పగా ఉండాలి" -ప్రిన్స్ మహేశ్ బాబు

"మీరుఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరపుకోవాలి. మీ రీ ఎంట్రీ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా మేడమ్" -అనిల్ రావిపూడి, దర్శకుడు

ప్రస్తుతం మహేశ్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారు.

ఇది చదవండి: హీరో రామ్‌కు రూ.200 జరిమానా విధించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details