'ఆ కాఫీ తాగితే.. గుడిలో ప్రసాదం తిన్నట్లే' - అమ్మ కాఫీ తాగితే గుడిలో ప్రసాదం తిన్నట్లే అన్న మహేశ్‌బాబు
'మహర్షి' సక్సెస్ మీట్ మాతృదినోత్సవం రోజునే జరిగింది. హీరో మహేశ్‌బాబు అమ్మతో తనకున్న అనుబంధాన్ని వివరించాడు. ఆమె చేసిన కాఫీ అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు.
'ఆ కాఫీ తాగితే.. గుడిలో ప్రసాదం తిన్నట్లే'
హైదరాబాద్‌లో జరిగిన మహర్షి సక్సెస్ మీట్లో మహేశ్‌బాబు ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. అమ్మంటే దేవుడితో సమానమని.. తన ప్రతి సినిమా విడుదల ముందు ఆమె చేసిన కాఫీ తాగుతానని సంతోషంతో చెప్పాడీ 'మహర్షి'. అలా చేస్తే గుడిలో ప్రసాదం తిన్నట్లే ఉంటుందంటున్నాడీ టాలీవుడ్ సూపర్‌స్టార్.