ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్‌కు ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. ఆయన.. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ బారినపడగా, ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో 10 రోజుల క్రితం సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. మంజ్రేకర్ ప్రస్తుతానికి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
ప్రముఖ బాలీవుడ్ నటుడికి క్యాన్సర్! - మహేశ్ మంజ్రేకర్ ఆరోగ్యం
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్‌కు ఇటీవలే కీలక సర్జరీ జరిగింది. ఆయన.. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ బారినపడినట్లు సమాచారం.
మహేశ్ మంజ్రేకర్
హిందీలో 'వాంటెడ్', 'రెడీ', 'ఓ మై గాడ్' సహా ఎన్నో చిత్రాల్లో నటించారు మంజ్రేకర్. 'వాస్తవ్', 'కురుక్షేత్ర', 'నటసామ్రాట్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు తెరపైనా 'అదుర్స్', 'సాహో' వంటి చిత్రాల్లో కనిపించారు. కాగా, ప్రస్తుతం ఆయన.. ఆయుష్ శర్మ, సల్మాన్ ఖాన్‌లతో 'అంతిమ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇదీ చూడండి:Abhishek Bachchan: షూటింగ్లో గాయపడ్డ హీరో అభిషేక్ బచ్చన్!