'మహర్షి'తో ఘన విజయాన్ని అందుకున్న మహేశ్ బాబు ప్రస్తుతం కుటంబంతో కలిసి హాలిడేలో ఉన్నాడు. లండన్ ఓవల్ వేదికగా జరుగుతున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ను కుటుంబంతో కలిసి వీక్షిస్తున్నాడు సూపర్‌స్టార్. వీరితో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా మ్యాచ్‌ను తిలకిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.
భారత్ - ఆసీస్ మ్యాచ్‌లో మహర్షి సందడి - match
లండన్ ఓవల్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను తిలకిస్తున్నాడు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్. కుటుంబంతో కలిసి హాజరయ్యాడు.
మహేశ్
'మహర్షి' చిత్రం అనంతరం అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు మహేశ్. ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. 'సరిలేరు నీకెవ్వరూ' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీరితో పాటు మ్యాచ్‌కు తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యారు. వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి ఫొటో దిగారు.
Last Updated : Jun 9, 2019, 5:19 PM IST