బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసుపై ముంబయి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తాజాగా నిర్మాత మహేశ్ భట్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు పోలీసులు. సుశాంత్‌ను వదిలేయమని రియాకు తానెప్పుడూ చెప్పలేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
సుశాంత్‌ను తన జీవితంలో రెండు సార్లు మాత్రమే కలిసినట్లు మహేశ్ భట్ వెల్లడించారు. "నేను నెపోటిజానికి ఎప్పుడూ మద్దతివ్వను. చాలా మంది కొత్తవారికి నేను అవకాశాలను ఇచ్చాను. ఇక సుశాంత్‌ను వ్యక్తిగతంగా రెండు సార్లు కలిశానంతే." అని మహేశ్ భట్ వివరించారు.