తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నమ్రతకు మహేశ్ స్పెషల్ బర్త్​డే విషెస్ - నమ్రతకు మహేశ్ స్బెషల్ విషెస్

Mahesh wishes Namrata: శుక్రవారం టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా బర్త్​డే విషెస్ తెలిపారు మహేశ్.

Mahesh Babu wishes wife Namrata , నమ్రతకు మహేశ్ విషెస్
Mahesh Babu

By

Published : Jan 22, 2022, 8:21 PM IST

Mahesh wishes Namrata: టాలీవుడ్​ మోస్ట్ లవింగ్ కపుల్స్​లో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ జోడీ ఒకటి. శనివారం నమ్రత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా బర్త్​డే విషెస్ తెలిపారు ప్రిన్స్. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ పోస్ట్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

"పుట్టినరోజు శుభాకాంక్షలు నమ్రత. నువ్వు నా రాక్.. నాతో నా ప్రపంచాన్ని పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు" అని నమ్రత ఫొటోను పోస్ట్ చేశారు మహేశ్. దీనికి నమ్రత సోదరి శిల్ప శిరోద్కర్​తో పాటు పలువురు స్పందిస్తూ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలయ్య 'ఆహా' ఓటీటీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' షోలోనూ సందడి చేశారు మహేశ్. ఈ పూర్తి ఎపిసోడ్ ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇవీ చూడండి: 'ఈ సినిమాలో నేను నటిస్తా.. కానీ ఓ కండిషన్'

ABOUT THE AUTHOR

...view details